From: pavithran <pav...@gm...> - 2012-04-20 19:03:07
|
తెలుగు స్థానీకరణ పదకోశాన్ని మెరుగుపరిచే ఉద్దేశ్యంతో తెలుగు స్థానీకరణ పదకోశ పరుగుకు(sprint) పూనుకోవడం జరిగింది. లక్ష్యం: 1. స్థానీకరణ పదకోశాన్ని ప్రమాణీకరించుట 2. Gnome ఉపకరణాలలో వాడే పదాలను తెలుగీకరించాలి. వేదిక: సురవర కార్యాలయం, వైశాలి నగర్, ఆల్విన్ కాలనీ, మియాపూర్. ( వివరాలకు "తొమ్మిది,నాలుగు,తొమ్మిది,నాలుగు,నాలుగు,నాలుగు,ఆరు,మూడు,ఏడు,సున్న" కి ఒక రింగ్ ఇవ్వండి ) శనివారం(21 ఏప్రిల్) ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకూ ఈ కార్యశాల కొనసాగుతుంది. • స్థానీకరణలో సాంకేతికతకు అనుగుణంగా అనేక కొత్త పదాలు వెలుగులోకి వస్తున్నాయి అయితే ఈ విధంగా ఉనికిలోకి వచ్చిన పదాలను ఎంతవరకూ వాడాలో అనే విషయంపై అనేక సందేహాలు ఉన్నాయి. • ఇప్పటికీ File, Edit వంటివాటికి తెలుగులో ఏ పదాలను వాడాలో అనే విషయంపై ఇప్పటికీ చర్చించుకుంటున్నాము. ఇటువంటి విషయాలన్నిటిపై సుదీర్ఘమైన చర్చల ద్వారా ఏకాభిప్రాయానికి రావాల్సివుంది. నేరుగా పాల్గొనలేనివారు chat.koodali.org వద్ద ఆన్లైన్లో పాల్గొనవచ్చు తాజా సమాచారానికై ట్విట్టర్, ఫేస్బుక్ మరియు ప్లస్ ద్వారా అనుసరించండి. ఆసక్తిగల వారందరూ పాల్గొని తమ అమూల్యమైన సలహాలను అందిస్తారని ఆశిస్తూ... అభినందనలతో... పవిత్రన్ శాఖమూరి. -- pavithran sakamuri http://look-pavi.blogspot.com |