|
From: Gōpāl/గోపాల్ <gop...@gm...> - 2012-09-15 14:44:16
|
నరసింహమూర్తి గారు, మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. ముఖ్యంగా "అసలెందుకు నేర్చుకోవాలి/చేయాలి" అన్న ప్రశ్నకు సమాధానం చాలా బలమైందిగా ఉండాలి. దీనికోసం వీలు చిక్కినప్పుడల్లా నేను సంబంధిత వ్యాసాలు చదువుతూ ఉన్నాను. ఉదాహరణకి (ఫేస్బుక్లో కనబడిన) ఈ వీడియో చూడండి: http://videolectures.net/metaforum2012_kornai_language/ ఇంజనీరింగ్ చేస్తుండగా, టెక్సేతు మొదలుపెట్టిన తొలిరోజుల్లో (2008-09) రాసిన ఈ వ్యాసం కూడా అలాంటి సమాధానాలు చెప్తూ రాసిందే (మార్పులు చేయాల్సిన అవసరం ఉంది): http://techsetu.com/pages/inspiration-future-india మీ సూచనలకి నెనర్లు. అన్నట్టుగా కంటెంట్ సిద్దం చేసే ప్రక్రియలోనే ఉన్నాను, పూర్తవ్వగానే పంపిస్తాను. On సెప్టెంబరు 14 శుక్రవారం 2012 ఉ. 07:25, tumarada narasimha murty wrote: > సభ్యులకు నమస్కారం > తెలుగు (లేదా వారి వారి మాతృ) లిపిని అభివృద్ది చెయ్యడానికి ఒక పెద్ద కూటమి అవసరం > కూటమి పెద్దది అవడానికి ఎక్కువ మంది సభ్యులు అవసరం > సభ్యులలో రెండు రకాలు 1) తమకి తాముగా వచ్చేవాళ్ళు 2) ప్రచారం ద్వారా వచ్చేవాళ్ళు > ఇప్పుడు గోపాల్ గారు ప్రతిపాదిస్తున్నది ఈ ప్రచారమే కాబట్టి నేను ఒకటి రెండు మాటలు ప్రచారం గురించి > చెప్పదలుచుకున్నాను. > ప్రచారానికి అత్యంత ముఖ్యమైనది "అజెండా". _* > అజెండా:*_ మనము ఎవరినైతే తెలుగులో(లేదా వారి మాతృ భాషలో ) టైపు చేయమని అడగదలుచుకున్నామో వాళ్ళంతా > ఇంతవరకూ ఇంగ్లీష్ లో టైపు చేస్తున్నవాళ్ళే. ఇన్నాళ్ళూ ఇంగ్లీష్ కి అలవాటు పడ్డవాళ్ళు ఒక్కసారి > మారాలంటే బలమైన కారణాలు కావాలి. మనం కోరే ఈ మార్పుకు బలమైన కారణాలను (justification) గనక > వాళ్లకి చూపించగలిగితే మన పని మరింత సులువు అవుతుందని నా అభిప్రాయం. ఈ కారణాలనే నేను అజెండా > అంటున్నాను. > ఇక్కడ నేను ఆలోచించిన, చదివిన, తెలుసుకున్న కారణాలు కొన్ని చెపుతున్నాను. సభ్యులు వీటిని చర్చించి > ఆమోదించవచ్చు లేదా మార్చవచ్చు లేదా నిరాకరించవచ్చు. > 1 ) మాతృ భాషలో చదువు - పరభాషలో చదువుకన్నా ఎక్కువ ఫలవంతంగా ఉంటుంది - గమనించాల్సిన > విషయం చదువుయొక్క పరమార్థం విద్యార్థికి పూర్తిగా అర్థమవడం. > మాతృభాషలో చదువు పై చర్చకోసం కొన్ని లింకులు: > http://unesdoc.unesco.org/images/0014/001466/146632e.pdf > http://articles.timesofindia.indiatimes.com/2012-06-15/mysore/32253507_1_mother-tongue-regional-languages-indian-language > > 2 ) ఒక పది పదిహేను సంవత్సరాల తరవాత ప్రపంచంలోని నిరుపేద దేశాలతో సహా ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ > అందుబాటులోకి వచేస్తుంది కాని తిండి గుడ్డ రావు. మంచి బోధన సరే సరి. ఇటువంటి పరిస్థితిలో ఒక పేద > విద్యార్థికి మంచి కంటెంట్ (వ్యాసాలూ, పాఠాలు, చర్చలూ మొదలైనవి) తెలుగులో అందుబాటులో ఉంటే చాలా > బాగుంటుంది. (తెవికీ) - ఇప్పుడు మన దేశం లో అందరికీ టెలిఫోను అందుబాటులో ఉంది కాని వైద్యం విద్యా > మొదలైనవి లేవు. జ > 3 ) భావ ప్రకటనకూ , సృజనాత్మకతకూ కొంతైనా ఇబ్బంది వస్తుంది. (ఈ విషయాన్ని నిరూపించడానికి > కొన్ని వినోదాత్మకమైన ఆటలు తయారుచేస్తే మంచిది). > 4 ) ఉదాహరణలు చూపించడం - ఏ ఏ భాషలలో ఎన్ని పుస్తకాలు ప్రచురితమవుతున్నాయి. ఏ ఏ భాషలు > ఇంటర్నెట్లో ఎక్కువ ప్రగతి సాధించాయి. ఏ ఏ భాష ఏ స్థానంలో ఉంది. ఇలా ... (స్పృహ, పోటీ తత్వం > పెరుగుతాయి). > > _*కూటమి యొక్క విధులు:*_ > ఇదే విధంగా మాతృభాషను వాడడం కొంత సులువు గా కూడా ఉండాలి. కొన్ని ఇంగ్లీష్ పదాలు (వాటికి సమానాలు > మన భాషలలో లేకపోవడం వల్ల) సర్వ సాధారణం అయిపోయాయి. కొన్ని ఇంగ్లీష్ పదాలు ( వాటికి సమానాలు మన > భాషలలో ఉన్నప్పటికీ ) సాధారణం అయిపోయాయి. > 1 ) మనం నిత్యం వాడే ఇంగ్లీష్ పదాలని గుర్తించాలి. > 2 ) వాటిని రెండు వర్గాలుగా విభజించాలి (ఇక్కడ విడగొట్టాలి అనే మాట వాడడం నాకిష్టం). మన భాషలో > సమానార్ధం ఉన్నవి, లేనివి. > 3 ) ఉన్న వాటి సామానార్థాలను విరివిగా వాడుతూ మళ్ళీ ప్రాచుర్యం లోకి తేవాలి (ఉదా: బుక్ - పుస్తకం; కీ > - తాళం; ఒపీనియన్ - అభిప్రాయం) > 4 ) లేనివాటిని మన పదాలుగానే గుర్తించాలి తప్ప పర భాషా పదాలుగా గుర్తించకూడదు.(బస్సు, కార్, > మొదలైనవి). ఈ ఇంగ్లీష్ పదాలను మాతృభాషలో విలీనం చెయ్యాలి. (భాష ప్రవహించే నీరు. చెరువులో నీరు > కాదు. మురిగిపోదు - మహాకవి) > 5 ) రాసే భాషని సరళీకృతం చెయ్యాలి. వీలైనంత ఎక్కువగా వాడుక భాష వాడాలి. > 6 ) ఇంగ్లీష్ భాషలో కొత్త పదాలు చేర్చడం ఒక నిరంతర ప్రక్రియ. నిఘంటువులు ఎప్పటికప్పుడు కొత్త > పదాలను స్వీకరిస్తూనే ఉంటాయి. ఈ పద్ధతి అన్ని భాషలూ అవలంబించాలి. > > ఇవి కొన్ని ఆలోచనలు. > ఇట్లు > నరసింహ మూర్తి > > > 2012/9/8 Arjuna Rao Chavala <arj...@gm... > <mailto:arj...@gm...>> > > (తెలుగు వికీ జట్టు కు నకలు చేస్తున్నాను) > > గోపాల్ గారు, > మీ ఆలోచన అభిలషణీయం. > > తెలుగు టైపు చేయడాన్ని తెలుగు వికీపీడియా <http://te.wikipedia.org>కు అనుసంధించి > నేర్పితే ఫలితం మెరుగుగా వుంటుందని నా అనుభవం. దానికై ఇప్పటికే ప్రదర్శనా పత్రాలు (చూడండి > <http://teluginux.blogspot.in/search/label/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%20%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80>) > వున్నాయి. వాటిని మెరుగుపరచవచ్చు. ఇలా అయితే తెవికీ సభ్యులు, ఔత్సాహికులు మరియు వికీమీడియా > ఇండియా <http://wiki.wikimedia.in> సంస్థ దాని నగర మరియు భాషా ప్రత్యేక ఆసక్తి > జట్టుల తరపున తోడ్పాటు, భాగస్వామ్యం,వనరులు లభించగలవు. > ఆలోచించగలరు > ధన్యవాదాలు > > అర్జున > > 2012/9/6 Gōpāl/గోపాల్ <gop...@gm... > <mailto:gop...@gm...>> > > నమస్తే, > > ఈ మెయిలు.. నా పూర్వపు మెయిలుకి మీరంతా పంపిన సమాధానాలూ, ఒక సంవత్సరంగా నా > బుర్రలోనే తప్ప ఆచరణకి నోచుకో(లే)ని కొన్ని ఆలోచనలూ కూడుకున్నది. మనందరం ఖచ్చితంగా > కోరుకునే ఒక్క విషయం: అంతా కష్టపడి మనం చేస్తున్న కృషికి తగిన ప్రయోజనం ఉండటం. > > ఐఐఐటి-హైదరాబాద్ పుణ్యమా అని హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో ఉన్న దాదాపు అన్ని పెద్ద > కార్పొరేట్ ఆఫీసుల్లో నాకు తెలిసిన వాళ్ళు, స్నేహితులు చాలా మందే ఉన్నారు. ఆ ఆఫీసుల్లో పని > చేసే వాళ్ళలో > 95% మందికి వాళ్ళ వాళ్ళ భాషల్లో టైప్ చేయడం, వాళ్ళ భాషల్లో బ్లాగులుండటం > గట్రా తెలియవు (ఇది నేను రూడీ చేసుకుని చెప్తున్న విషయం). నా ఆలోచన ఇది: ఈ కార్పొరేట్ > సంస్థలలో పని చేస్తున్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళ భాషల్లో టైప్ చేయడం నేర్పించడం (తెలుగొక్కటే > కాదు), బ్లాగులు/వికీపిడియా పరిచయం చేయడం. HR department, Social welfare > (లాంటి) department ని సంప్రదించి ఇలాంటి workshopలు గాని, టాక్లు గాని ఇవ్వడం > కుదురుతుందో లేదో కనుక్కోవడానికి Pega, CSC లలో సంప్రదించమన్నాను నా స్నేహితులని. > కుదురుతుందని abstract/వివరాలు పంపమని చెప్పారు. > > అయితే ఇదొక *విప్లవంలా జరగాలి*. మాతృభాషలో టైప్ చేయడం అంటే *prestige* లా భావించాలి, > *స్టైల్ factor* ఉండాలి. తగిన కంటెంట్ తయారు చేస్తున్నాను, సమయం పట్టొచ్చు. > వర్కుషాపులకి, టాకులకీ మట్టుకు ఖచ్చితంగా ఒక జట్టు కావాలి: presentations బల్ల > గుద్దినట్టుండేలా ఇచ్చే వాళ్ళు మరీ మరీ కావాలి. నేను నవంబరు నుంచి జనవరి మొదటి వారం > దాకా ఇండియాలో (చెన్నై, మధ్యమధ్యలో హైదరాబాద్) ఉంటాను. బహుశా ఆ సమయానికి ఈ కంటెంట్ > సిద్దంగానూ ఉంటుంది, అప్పటికి మరికొన్ని సంస్థలనుంచి అనుమతి కూడా తీస్కుని ఉంటాను. > అప్పుడు కలిసి మాట్లాడి పనులు మొదలుపెడదాం. > > మీరు సహాయపడగలరా? ఇంకెవరైనా ఆసక్తి చూపేవాళ్ళుంటే వాళ్ళకి కూడా చెప్పండీ విషయం! > > -- > > Regards, > -- > Kōḍūri Gōpāla Kr̥ṣṇa, > Music Technology Group, UPF - Barcelona, Spain. > > Portfolio -http://tidbits.co.in > తెలుగువారికి సాంకేతిక సహాయం -http://techsetu.com > > -- > You received this message because you are subscribed to the > Google Groups "linux-telugu-users" group. > To post to this group, send an email to > lin...@go... > <mailto:lin...@go...>. > To unsubscribe from this group, send email to > lin...@go... > <mailto:linux-telugu-users%2Bu...@go...>. > For more options, visit this group at > http://groups.google.com/group/linux-telugu-users?hl=en-GB. > > > -- > "తెలుగువికీ" గుంపులో మీకు సభ్యత్వం ఉంది కాబట్టి మీకీ మెయిలు వచ్చింది. > ఈ గుంపుకు పోస్టు చేసేందుకు, tel...@go... > <mailto:tel...@go...> కు మెయిలు పంపండి. > ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, tel...@go... > <mailto:tel...@go...> కు మెయిలు పంపండి. > మరిన్ని వికల్పాల కోసం, ఈ గుంపును > http://groups.google.com/group/teluguwiki?hl=te వద్ద చూడండి > > > > > -- > T Narasimha Murty > Srikakulam > 9966582234 > > > _______________________________________________ > Localization mailing list > Loc...@sw... > http://swecha.net/mailman/listinfo/localization_swecha.net -- Regards, -- Kōḍūri Gōpāla Kr̥ṣṇa, Music Technology Group, UPF - Barcelona, Spain. Portfolio - http://tidbits.co.in తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com |