|
From: Arjuna R. C. <arj...@gm...> - 2012-09-14 02:34:23
|
2012/9/14 Gōpāl/గోపాల్ <gop...@gm...> > అర్జునరావు గారు, > > మీ ఆలోచన బావుంది. > > అంచెలంచెలుగా ప్రణాళికతో వెళ్తే ఆశించిన ఫలితాలు ఉంటాయని నా నమ్మకం. ఇదివరలో > నేను ఎవరికైనా కంప్యూటర్లో తెలుగు వాడకం గురించి చెప్పినప్పుడు అన్నీ ఒకేసారి > చెప్పెయ్యాలి అన్న ఉబలాటంతో అవతలి వారిని ఉక్కిరిబిక్కిరి చేసేయడమో, లేదా > "ఇన్ని" నేర్చుకోవాలా/తెలుసుకోవాలా అన్న భావన వారిలో కల్పించడమో జరిగేది. అలా > కాకుండా ముందు టైప్ చేయడం, బ్లాగు రాయడం నేర్పించి, ఆ తర్వాత కొన్నాళ్ళకి > ఆసక్తి ఉన్నవాళ్ళకు వికిపీడియా గురించి, అనువాదాల గురించి విడివిడిగానో కలిపో > చెప్తే బావుంటుందని నా అభిప్రాయం. > బ్లాగు పై ఆసక్తి వున్నవాళ్లకి ఆ ప్రాధాన్యత పనికిరావచ్చు. నా దృష్టిలో చాలా బ్లాగర్లు వికీపీడియాలో ప్రవేశించినతరువాత బ్లాగర్లు అయ్యారు. వికీపీడీయా అయితే అందరికి ఉపయోగపడే మానవాళి ఉపయోగాపేక్ష తప్ప ఇతర అపేక్షలులేనిది కనుక, బ్లాగు ప్లాట్‌ఫారమ్ లో తేడాలు అవి పట్టించుకోకుండా చెప్పటానికి వీలవుతుంది. టైపింగు అనుభవానికి వికీసోర్స్ వాడవచ్చు. వ్యాసాల నమూనాలకు మొదటిపేజీలో ప్రచురితమైన వ్యాసాలు చూపించవవచ్చు. వ్యాసాలకు వాడుకునే బొమ్మలగురించి కామన్స్ పరిచయంచేయవచ్చు. వారికి వచ్చే సవాలక్ష అనుమానాలకు చాలా సమాధానాలు వికీలో చూపించవచ్చు. వారి వారి వాడుకరిపేజీలలో వ్యాసాలు ప్రారంభింపచేయవచ్చు. ధన్యవాదాలు. అర్జున > > > On సెప్టెంబరు 08 శనివారం 2012 ఉ. 06:27, Arjuna Rao Chavala wrote: > > (తెలుగు వికీ జట్టు కు నకలు చేస్తున్నాను) > > గోపాల్ గారు, > మీ ఆలోచన అభిలషణీయం. > > తెలుగు టైపు చేయడాన్ని తెలుగు వికీపీడియా <http://te.wikipedia.org>కు > అనుసంధించి నేర్పితే ఫలితం మెరుగుగా వుంటుందని నా అనుభవం. దానికై ఇప్పటికే > ప్రదర్శనా పత్రాలు (చూడండి<http://teluginux.blogspot.in/search/label/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%20%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80>) > వున్నాయి. వాటిని మెరుగుపరచవచ్చు. ఇలా అయితే తెవికీ సభ్యులు, ఔత్సాహికులు > మరియు వికీమీడియా ఇండియా <http://wiki.wikimedia.in> సంస్థ దాని నగర మరియు > భాషా ప్రత్యేక ఆసక్తి జట్టుల తరపున తోడ్పాటు, భాగస్వామ్యం,వనరులు లభించగలవు. > ఆలోచించగలరు > ధన్యవాదాలు > > అర్జున > > 2012/9/6 Gōpāl/గోపాల్ <gop...@gm...> > >> నమస్తే, >> >> ఈ మెయిలు.. నా పూర్వపు మెయిలుకి మీరంతా పంపిన సమాధానాలూ, ఒక సంవత్సరంగా నా >> బుర్రలోనే తప్ప ఆచరణకి నోచుకో(లే)ని కొన్ని ఆలోచనలూ కూడుకున్నది. మనందరం >> ఖచ్చితంగా కోరుకునే ఒక్క విషయం: అంతా కష్టపడి మనం చేస్తున్న కృషికి తగిన >> ప్రయోజనం ఉండటం. >> >> ఐఐఐటి-హైదరాబాద్ పుణ్యమా అని హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో ఉన్న దాదాపు >> అన్ని పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో నాకు తెలిసిన వాళ్ళు, స్నేహితులు చాలా మందే >> ఉన్నారు. ఆ ఆఫీసుల్లో పని చేసే వాళ్ళలో > 95% మందికి వాళ్ళ వాళ్ళ భాషల్లో టైప్ >> చేయడం, వాళ్ళ భాషల్లో బ్లాగులుండటం గట్రా తెలియవు (ఇది నేను రూడీ చేసుకుని >> చెప్తున్న విషయం). నా ఆలోచన ఇది: ఈ కార్పొరేట్ సంస్థలలో పని చేస్తున్న వాళ్ళకి >> వాళ్ళ వాళ్ళ భాషల్లో టైప్ చేయడం నేర్పించడం (తెలుగొక్కటే కాదు), >> బ్లాగులు/వికీపిడియా పరిచయం చేయడం. HR department, Social welfare (లాంటి) >> department ని సంప్రదించి ఇలాంటి workshopలు గాని, టాక్‌లు గాని ఇవ్వడం >> కుదురుతుందో లేదో కనుక్కోవడానికి Pega, CSC లలో సంప్రదించమన్నాను నా >> స్నేహితులని. కుదురుతుందని abstract/వివరాలు పంపమని చెప్పారు. >> >> అయితే ఇదొక *విప్లవంలా జరగాలి*. మాతృభాషలో టైప్ చేయడం అంటే *prestige* లా >> భావించాలి, *స్టైల్ factor* ఉండాలి. తగిన కంటెంట్ తయారు చేస్తున్నాను, సమయం >> పట్టొచ్చు. వర్కుషాపులకి, టాకులకీ మట్టుకు ఖచ్చితంగా ఒక జట్టు కావాలి: >> presentations బల్ల గుద్దినట్టుండేలా ఇచ్చే వాళ్ళు మరీ మరీ కావాలి. నేను >> నవంబరు నుంచి జనవరి మొదటి వారం దాకా ఇండియాలో (చెన్నై, మధ్యమధ్యలో హైదరాబాద్) >> ఉంటాను. బహుశా ఆ సమయానికి ఈ కంటెంట్ సిద్దంగానూ ఉంటుంది, అప్పటికి మరికొన్ని >> సంస్థలనుంచి అనుమతి కూడా తీస్కుని ఉంటాను. అప్పుడు కలిసి మాట్లాడి పనులు >> మొదలుపెడదాం. >> >> మీరు సహాయపడగలరా? ఇంకెవరైనా ఆసక్తి చూపేవాళ్ళుంటే వాళ్ళకి కూడా చెప్పండీ >> విషయం! >> >> -- >> >> Regards, >> -- >> Kōḍūri Gōpāla Kr̥ṣṇa, >> Music Technology Group, UPF - Barcelona, Spain. >> >> Portfolio - http://tidbits.co.in >> తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com >> >> -- >> You received this message because you are subscribed to the Google Groups >> "linux-telugu-users" group. >> To post to this group, send an email to >> lin...@go.... >> To unsubscribe from this group, send email to >> lin...@go.... >> For more options, visit this group at >> http://groups.google.com/group/linux-telugu-users?hl=en-GB. >> > > -- > You received this message because you are subscribed to the Google Groups > "linux-telugu-users" group. > To post to this group, send an email to > lin...@go.... > To unsubscribe from this group, send email to > lin...@go.... > For more options, visit this group at > http://groups.google.com/group/linux-telugu-users?hl=en-GB. > > > -- > > Regards, > -- > Kōḍūri Gōpāla Kr̥ṣṇa, > Music Technology Group, UPF - Barcelona, Spain. > > Portfolio - http://tidbits.co.in > తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com > > |