|
From: Arjuna R. C. <arj...@gm...> - 2012-09-08 04:27:31
|
(తెలుగు వికీ జట్టు కు నకలు చేస్తున్నాను) గోపాల్ గారు, మీ ఆలోచన అభిలషణీయం. తెలుగు టైపు చేయడాన్ని తెలుగు వికీపీడియా <http://te.wikipedia.org>కు అనుసంధించి నేర్పితే ఫలితం మెరుగుగా వుంటుందని నా అనుభవం. దానికై ఇప్పటికే ప్రదర్శనా పత్రాలు (చూడండి<http://teluginux.blogspot.in/search/label/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%20%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80>) వున్నాయి. వాటిని మెరుగుపరచవచ్చు. ఇలా అయితే తెవికీ సభ్యులు, ఔత్సాహికులు మరియు వికీమీడియా ఇండియా <http://wiki.wikimedia.in> సంస్థ దాని నగర మరియు భాషా ప్రత్యేక ఆసక్తి జట్టుల తరపున తోడ్పాటు, భాగస్వామ్యం,వనరులు లభించగలవు. ఆలోచించగలరు ధన్యవాదాలు అర్జున 2012/9/6 Gōpāl/గోపాల్ <gop...@gm...> > నమస్తే, > > ఈ మెయిలు.. నా పూర్వపు మెయిలుకి మీరంతా పంపిన సమాధానాలూ, ఒక సంవత్సరంగా నా > బుర్రలోనే తప్ప ఆచరణకి నోచుకో(లే)ని కొన్ని ఆలోచనలూ కూడుకున్నది. మనందరం > ఖచ్చితంగా కోరుకునే ఒక్క విషయం: అంతా కష్టపడి మనం చేస్తున్న కృషికి తగిన > ప్రయోజనం ఉండటం. > > ఐఐఐటి-హైదరాబాద్ పుణ్యమా అని హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో ఉన్న దాదాపు > అన్ని పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో నాకు తెలిసిన వాళ్ళు, స్నేహితులు చాలా మందే > ఉన్నారు. ఆ ఆఫీసుల్లో పని చేసే వాళ్ళలో > 95% మందికి వాళ్ళ వాళ్ళ భాషల్లో టైప్ > చేయడం, వాళ్ళ భాషల్లో బ్లాగులుండటం గట్రా తెలియవు (ఇది నేను రూడీ చేసుకుని > చెప్తున్న విషయం). నా ఆలోచన ఇది: ఈ కార్పొరేట్ సంస్థలలో పని చేస్తున్న వాళ్ళకి > వాళ్ళ వాళ్ళ భాషల్లో టైప్ చేయడం నేర్పించడం (తెలుగొక్కటే కాదు), > బ్లాగులు/వికీపిడియా పరిచయం చేయడం. HR department, Social welfare (లాంటి) > department ని సంప్రదించి ఇలాంటి workshopలు గాని, టాక్లు గాని ఇవ్వడం > కుదురుతుందో లేదో కనుక్కోవడానికి Pega, CSC లలో సంప్రదించమన్నాను నా > స్నేహితులని. కుదురుతుందని abstract/వివరాలు పంపమని చెప్పారు. > > అయితే ఇదొక *విప్లవంలా జరగాలి*. మాతృభాషలో టైప్ చేయడం అంటే *prestige* లా > భావించాలి, *స్టైల్ factor* ఉండాలి. తగిన కంటెంట్ తయారు చేస్తున్నాను, సమయం > పట్టొచ్చు. వర్కుషాపులకి, టాకులకీ మట్టుకు ఖచ్చితంగా ఒక జట్టు కావాలి: > presentations బల్ల గుద్దినట్టుండేలా ఇచ్చే వాళ్ళు మరీ మరీ కావాలి. నేను > నవంబరు నుంచి జనవరి మొదటి వారం దాకా ఇండియాలో (చెన్నై, మధ్యమధ్యలో హైదరాబాద్) > ఉంటాను. బహుశా ఆ సమయానికి ఈ కంటెంట్ సిద్దంగానూ ఉంటుంది, అప్పటికి మరికొన్ని > సంస్థలనుంచి అనుమతి కూడా తీస్కుని ఉంటాను. అప్పుడు కలిసి మాట్లాడి పనులు > మొదలుపెడదాం. > > మీరు సహాయపడగలరా? ఇంకెవరైనా ఆసక్తి చూపేవాళ్ళుంటే వాళ్ళకి కూడా చెప్పండీ > విషయం! > > -- > > Regards, > -- > Kōḍūri Gōpāla Kr̥ṣṇa, > Music Technology Group, UPF - Barcelona, Spain. > > Portfolio - http://tidbits.co.in > తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com > > -- > You received this message because you are subscribed to the Google Groups > "linux-telugu-users" group. > To post to this group, send an email to > lin...@go.... > To unsubscribe from this group, send email to > lin...@go.... > For more options, visit this group at > http://groups.google.com/group/linux-telugu-users?hl=en-GB. > |