|
From: Gōpāl/గోపాల్ <gop...@gm...> - 2012-08-31 15:24:46
|
నమస్తే,
కొంత సమాచారం కోసం ఎంత ప్రయత్నించినా ఒక పట్టాన దొరికేలా కనిపించలేదు. దేశంలో లేకపోవడం వల్ల
కష్టమవుతుందో, అందరికీ అంతేనో తెలీదు. అందుకే ఇలా మెయిల్ చేస్తున్నాను.
* తెలుగు స్థానికీకరణ మీద ఎన్ని టీంలు పని చేస్తున్నాయి? కొన్నాళ్ళగా నేను కూడా అనువదిస్తున్నా నాకు
తెలిసినవి కొన్నే అని నా అనుమానం: స్వేచ్చ <http://www.swecha.org/>, IndLinux
<http://www.indlinux.org/wiki/index.php/Main_Page>, Linux telugu
users <https://sites.google.com/site/linuxteluguusers/>. వీళ్ళల్లో
ఎంతమంది ఇంకా అనువాదాలు చేస్తున్నారు? వాళ్ళందరి మధ్యా సమన్వయం ఉందా?
* ఇందులో IndLinux/Telugu, స్వేచ్చ వాళ్ళ వెబ్సైట్లు ఇంగ్లీష్ లో ఉండటంలో అర్థం ఏంటి?
* తెలుగు అనువాదాల కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమైనా చేసిందా? పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం
తెలుగుకి అధికార పీఠం అని అనుకుంటున్నాను. వారేమైనా పాలుపంచుకున్నారా/కుంటున్నారా?
అందరూ కలిసి స్థానికీకరణ అనే అంఖాన్ని చక్కగా నడిపించి ఇంత దాకా తెచ్చారు, ఇంకొన్ని విషయాల్లో మనం
జాగ్రత్త పడితే భవిష్యత్తులో పరిస్థితి మెరుగ్గా ఉండడానికి సహాయ చేసినవాళ్ళం కూడా అవుతాం. నేను
చెప్పదలుచుకున్నవి ఇవి.
* ఇప్పటికి చాలా కాలంగా తెలుగులో లినక్సు వాడుతున్నాను. ఇంకా తప్పులు కనబడుతున్నాయి: కొన్ని చోట్ల
పదాలు పొసగక అర్థం మారిపోవడం, కొన్ని చోట్ల అసలు అర్థమే లేకపోవడం వంటివి. నాకు చేతనైతే సరి
చేస్తున్నాను. అనువాదాలు కష్టమన్న సంగతి తెలుసు, కాని ఇలాంటివి ముందు జాగ్రత్త చర్యలతో
నివారించవచ్చు. తెలుగు అనువాదాలు చేసే అందరం ఒక జట్టుగా
<https://groups.google.com/forum/?fromgroups=#%21forum/telugulocalization>
ఉంటే ఇది తేలికవుతుంది.
* ఎప్పటికప్పుడు సభ్యులు చూసేందుకు/నవీకరించేందుకు సౌకర్యం ఉండేలా ఒక చోట పదకోశం ఉండాలి.
మెయిళ్ళు, సైట్లో zip ఫైళ్ళు సరికావు. ఇప్పటికే ఉన్నవాటిని పంపిస్తే, ఇందుకు నేను సహాయ పడగలను
(A shared google doc will just be fine and way better than adhoc
transfers).
* అప్లికేషన్ దత్తత తీసుకోవడం: ఒకో సభ్యుడు ఒకో అప్లికేషన్ని దత్తత తీసుకుని చేస్తే త్వరగా అవ్వడమే
కాక, అనువాదాలు మెరుగ్గా ఉంటాయని నా నమ్మకం (బాధ్యత కొంచెం బలంగా ఉంటుంది కాబట్టి). ఇద్దరేసి
జతగా ఉంటే ఒకరు చేసిన అనువాదం మరొకరు సరిచూడొచ్చు. దీని వల్ల పని కూడా de-centralized
గా సుళువుగా జరుగుతుంది.
నేను రాసిన ఏ అంశమైనా ఎవరినైనా కష్టపెడితే క్షమించండి. తెలియనితనం దొర్లినట్టుంటే తెలియజెప్పండి. I'm
wishing for a constructive participation from all the people who made it
all the way till here. IMHO, it only takes one more gentle push to
realize a usable Telugu Linux distribution.
--
Regards,
--
Kōḍūri Gōpāla Kr̥ṣṇa,
Music Technology Group, UPF - Barcelona, Spain.
Portfolio - http://tidbits.co.in
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com
|