|
From: Gōpāl/గోపాల్ <gop...@gm...> - 2012-08-28 22:22:06
|
నమస్కారం, నేను చెప్పబోయే విషయం ఇంతకుముందే చర్చకు వచ్చి ఉంటుంది, అయినా ఇంకోసారి మనవి చేస్కోవడంలో తప్పులేదు కదా. ఈ ఉదాహరణ చూడండి: *Original:* "List of enabled tracking methods. \"name\" will enable switching activities " "by name defined in workspace_mapping. \"memory\" will enable switching to " "the last activity when returning to a previous workspace." *Translation:* "సశక్త పరువు ట్రాక్ చేయు విధానములు యొక్క పట్టిక. \"నామము\" పని ప్రదేశాలు అనువంశిక లక్షణసంపుటిలో " "జన్యుకణపు స్థలములో నిర్వచించిన క్రియాకలాపములు మార్చటం సశక్త పరుస్తుంది.\"జ్ఞాపకశక్తి\" పూర్వపు పని " "ప్రదేశాలు వెల్లినచో ఆఖరి క్రియాకలాపమునకు మారుట మొదలవుతుంది." ఇందులో అర్థరాహిత్యం, అక్షరదోషాలు తప్పితే నాకేమి కనిపించలేదు. అసలది జీవశాస్త్ర చిక్కుముడో, hamster-applet అనువాదమో చెప్పకుండా కనుక్కున్నవాళ్ళకి బహుమతివ్వచ్చు. ఇలా అనువదించే కంటే దాన్నలా వదిలేస్తే అనువాదం కానిదిగా కనిపిస్తుంది కాబట్టి తెలిసిన వాళ్ళు అనువదిస్తారు. మరొక ముఖ్యమైన విషయం: మాట్లాడే భాషకు దగ్గరగా ఉంటే తప్పితే ఈ కాలంలో తెలుగులో కంప్యూటర్లు వాడి ఉద్దరించే మహాపిండాలు లేవు. కాబట్టి ఈ విషయం కాస్త ఘాట్టిగా మనసులో వేస్కోమని విజ్ఞప్తి. -- Regards, -- Kōḍūri Gōpāla Kr̥ṣṇa, Music Technology Group, UPF - Barcelona, Spain. Portfolio - http://tidbits.co.in తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com |